రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తవ్వగా తెలంగాణ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రవణ్ బరిలో ఉన్నారు. ఇక ఏపీ నుంచి బీటీ నాయుడు, గ్రీష్మ, బీదా రవిచంద్ర, సోము వీర్రాజు, నాగబాబు నామినేషన్లు వేశారు. రేపటితో నామినేషన్ల ఉపసంహరణ ముగియనుండగా అదే రోజు సాయంత్రం ఈసీ ప్రకటన చేయనుంది.