HomePoliticalఅక్ర‌మ కేసుల‌తో భ‌య‌పెట్ట‌లేరు..క‌విత‌

అక్ర‌మ కేసుల‌తో భ‌య‌పెట్ట‌లేరు..క‌విత‌

సీఎం రేవంత్ రెడ్డి శాస‌న‌స‌భ‌లో ప్ర‌తిప‌క్షాల‌కు స‌మాధానం చెప్ప‌లేక కేటీఆర్ పై అక్ర‌మంగా క‌క్ష‌పూరితంగా కేసులు పెడుతున్నార‌ని మండిప‌డ్డారు ఎమ్మెల్సీ క‌విత‌.ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా ఆమె స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డిపై మండిప‌డ్డారు.ఫార్ములా ఈ – కార్ రేసింగ్ ఈవెంట్‌లో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే.

కేసీఆర్, బీఆర్ఎస్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ చర్యలు, వ్యవహరిస్తున్న తీరును తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తామంతా తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన కేసీఆర్ సైనికులమనే విషయాన్ని సీఎం గుర్తు పెట్టుకోవాలన్నారు. అక్రమ కేసులతో భయపెట్టలేరని అన్నారు. తాము మరింత బలపడి పోరాటాన్ని కొనసాగిస్తుంటామని తెలిపారు. తెలంగాణ స్పూర్తి గెలుస్తుందని కవిత పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read