నటుడు మోహన్ బాబు మీడియాకు బహిరంగ క్షమాపణలు తెలిపాడు. మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల నేపథ్యంలో సినీ నటుడు మంచు మోహన్ బాబు జర్నలిస్ట్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటనలో జర్నలిస్ట్‌కు తీవ్రగాయాలు కాగా.. మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలి అంటూ జర్నలిస్ట్ సంఘాలు అన్నీ ధర్నా చేయడం మొదలు పెట్టాయి. ఈ క్రమంలోనే యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ రంజిత్‌ను కలిసిన మోహన్ బాబు అతడికి బహిరంగ క్షమాపణలు తెలిపాడు. అనంతరం అతడి కుటుంబాన్ని పరమర్శించి.. ఆయన కుటుంబసభ్యులకు సారీ చెప్పారు. మెహన్ బాబుతో పాటు మంచు విష్ణు కూడా జర్నలిస్ట్ రంజిత్‌ను కలిసి పరమర్శించాడు. కాగా.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.