HomePoliticalనెల‌రోజులు 144 సెక్ష‌న్..ఎందుకీ ప‌రిస్థితి

నెల‌రోజులు 144 సెక్ష‌న్..ఎందుకీ ప‌రిస్థితి

తెలంగాణ‌లో సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం అనాలోచిత నిర్ణ‌యాల‌కి వ్య‌తిరేకంగా , ఎన్నికల హామీల అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బాధితులు సచివాలయాన్ని ముట్టడిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. నెలరోజుల పాటు ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆదేశాలు జారీ చేశారు. నగరంలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్వసనీయ సమాచారం అందిందని, ఈ నేపథ్యంలో ఆంక్షలు విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సోమవారం నుంచి నవంబర్‌ 28 వరకు సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై నిషేదం విధిస్తున్నట్లు తెలిపారు. ఐదుగురికి మించి గుమికూడితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 163 కింద ఆంక్షలు విధించినట్లు తెలిపారు. ఏక్‌పోలీస్‌ విధానం అమలు, సస్పెండ్‌ చేసిన కానిస్టేబుళ్లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బెటాలియన్‌ కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళన ఉధృతమైంది. యూనిఫాంలతో వచ్చి సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు హైదరాబాద్‌లో ఆంక్షలు విధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read