HomeEntertainmentరూ.120కోట్ల‌కి..రూ.25కోట్లు వ‌చ్చాయా..

రూ.120కోట్ల‌కి..రూ.25కోట్లు వ‌చ్చాయా..

సినీ రంగంలో జ‌యాప‌జ‌యాలు ఎప్పుడు వ‌స్తాయో ఎప్పుడు పోతాయో చెప్ప‌లేం. అలాగే మ‌నం ఊహించ‌ని న‌ష్టాలు కూడా వ‌స్తుంటాయి.ఇప్పుడ‌దే జ‌రిగింది ఓ సినిమావిష‌యంలో. మార్టిన్’ సినిమా చేశాడు ధ్రువ‌స‌ర్జా… ఏపీ అర్జున్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ధ్రువ సర్జా ఎవరో కాదు, యాక్షన్ కింగ్ అర్జున్ కి మేనల్లుడు. అర్జున్ కి కథ .. స్క్రీన్ ప్లే – దర్శకత్వ విభాగాలపై మంచి పట్టు ఉంది. అందువలన ఆయన తన మేనల్లుడి కోసం ఒక మంచి కథను రెడీ చేసి ఇచ్చాడు. ఆ కథతో రూపొందిన సినిమానే ఇది. టీజర్ .. ట్రైలర్ తో ఈ సినిమా ఒక్కసారిగా హైప్ తెచ్చుకుంది. అందరూ కూడా ‘కేజీఎఫ్’ తో పోలుస్తూ మాట్లాడుకున్నారు.


ఈ సినిమా దసరా సందర్భంలో అక్టోబర్ 11వ తేదీన విడుదలైంది. 120 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాను, కన్నడతో పాటు తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో విడుదల చేశారు. అయితే ఈ భాషలన్నిటిలో కలుపుకుని ఈ సినిమా 25 కోట్లను మాత్రమే వసూలు చేసిందని టాక్. వైభవి శాండిల్య కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 23వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img