సుభాష్ పాత్ర నేను చేయాల్సింది అన్నారు మలయాళ నటుడు అసిఫ్ అలీ. అసిఫ్ అలీ ఎంచుకునే కథలు .. పాత్రలు సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఈ మధ్యనే వచ్చిన ఆయన సినిమా ‘కిష్కింద కాండం’ బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులను నమోదు చేసింది. అలాంటి అసిఫ్ అలీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘మంజుమ్మేల్ బాయ్స్’ సినిమాలో తాను చేయవలసి ఉందని చెప్పాడు. ఈ సినిమాలో ‘సుభాష్’ అనే పాత్ర సొరంగ మార్గంలా కనిపించే ఒక అగాధంలోకి జారిపోతుంది. ఆ పాత్రను బయటికి తీసుకు రావడానికి మిగతా స్నేహితులంతా నానా తంటాలు పడతారు. యథార్థ సంఘటన ఆధారంగా నిర్మించిన ఈ సినిమా, 240 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో సుభాష్ పాత్ర కోసం దర్శక నిర్మాతలు ముందుగా అసిఫ్ అలీని అనుకున్నారట. అయితే ఆ సమయంలో తన డేట్స్ లేకపోవడం వలన చేయలేకపోయానని అసిఫ్ అలీ అన్నాడు. అసిఫ్ అలీకి స్టార్ ఇమేజ్ ఉంది. ఆయన గుహలో పడిపోతే, ఆ పాత్ర తప్పకుండా బ్రతుకుతుందని ఆడియన్స్ గెస్ చేసేవారు. అందువలన ఆ పాత్రను వేరొకరితో చేయించడమే మంచిదైందనేది ఇప్పుడు వినిపిస్తున్న టాక్.