HomeEntertainmentజియో హాట్ స్టార్ లో..ముఫాసా: ది లయన్‌ కింగ్’

జియో హాట్ స్టార్ లో..ముఫాసా: ది లయన్‌ కింగ్’

హాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ ‘ముఫాసా: ది లయన్‌ కింగ్’ ఓటీటీలోకి రాబోతుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ అప్‌డేట్‌ని ప్ర‌క‌టించారు మేక‌ర్స్. ‘ది లయన్‌ కింగ్‌’ సినిమాకు ప్రీక్వెల్‌గా వ‌చ్చిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 20న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సూప‌ర్ హిట్ అందుకోవ‌డ‌మే కాకుండా ఇండియాలోనే దాదాపు రూ.100 కోట్ల వసూళ్ల‌ను రాబ‌ట్టింది. ఇక తెలుగులో ముఫాసా అనే రాజు పాత్ర‌కు మ‌హేశ్ బాబు డ‌బ్బింగ్ చెప్ప‌గా.. బాలీవుడ్ హిందీ వెర్ష‌న్‌కి షారుఖ్ ఖాన్ డ‌బ్బింగ్ చెప్పాడు. ముఫాసా కొడుకు పాత్ర అయిన సింబా పాత్ర‌కు షారుఖ్ కొడుకు ఆర్య‌న్ ఖాన్ డ‌బ్బింగ్ చెప్పాడు. ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది. ప్ర‌ముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్‌లో ఈ చిత్రం మార్చి 26 నుంచి తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, త‌మిళం భాష‌ల్లో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు వెల్ల‌డించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read