ఈనెల 5న తన పుట్టినరోజును ఇండియాలోనే జరుపుకున్నాడు విరాట్ కోహ్లీ. తన విరామ సమయాన్ని ఫ్యామిలీతో గడుపుతున్నాడు. ప్రస్తుతం ముంబయిలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య అనుష్క శర్మ కుమారుడు అకాయ్, కుమార్తె వామికతో కలిసి సరదాగా గడుపుతున్నాడు.తాజాగా ఈ దంపతులు ముంబయిలోని ఫేమస్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ బెన్నె బాంబేలో ప్రత్యక్షమయ్యారు. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేశారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ సిబ్బందితో ఇద్దరూ సరదాగా ఫొటోలు దిగారు. ఆ ఫొటోలను సదరు రెస్టారెంట్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంది. దాంతో ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.