HomeHealthశ‌రీరానికి ఔష‌ధంలా.. మున‌గ ఆకులు

శ‌రీరానికి ఔష‌ధంలా.. మున‌గ ఆకులు

చాలామందికి మున‌గ‌కాయ‌లు అంటే ఇష్టం..క‌ల‌గ‌ల‌పు కూర‌ల్లో, సాంబారు ఇలా ప‌లు కూర‌ల్లో మున‌గ‌కాయ‌లు వాడుతుంటారు. అయితే మున‌గ ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.మ‌రి మున‌గ ఆకుల‌ని తినడం వ‌ల్ల ఏం లాభాలో చూద్దాం..

మునగ ఆకులు శరీరంలో కొవ్వు కణాల నియంత్రణకు తోడ్పడుతున్నట్టు ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు మునగ ఆకులు ఆకలిని కూడా తగ్గిస్తాయని తేల్చారు. అంటే బరువు తగ్గాలనుకునే వారికి మునగ మంచి చాయిస్‌ అని చెప్పొచ్చు. మునగ ఆకుల్లో కాల్షియం, ఫాస్పరస్‌ ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన ఎముకలు, దంతాలు బలంగా ఉండేందుకు తోడ్పడుతాయి. తరచూ మునగ ఆకులను తీసుకునేవారు వృద్ధాప్యంలో ఎముకలు బలహీనపడే ‘ఆస్టియో పోరోసిస్‌’ సమస్య నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.తాజా మునగ ఆకుల్లో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌ గా పనిచేస్తుంది. మన శరీరం వైరస్‌ లు, బ్యాక్టీరియాలతో పోరాడేందుకు తోడ్పడుతుంది. జలుబు, ఇతర ఇన్ఫెక‌్షన్ల నుంచి కాపాడుతుంది.మునగ ఆకుల్లో ఉండే కొన్ని రసాయన సమ్మేళనాలు మన శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయులు, రక్తపోటు తక్కువగా ఉండటానికి తోడ్పడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

తద్వారా గుండె ఆరోగ్యానికి మునగ అండగా ఉంటుందని చెబుతున్నారు.అప్పుడప్పుడూ మునగ ఆకుల రసం తీసుకుంటూ ఉంటే రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు తగ్గుతున్నట్టుగా శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్నవారికి మునగతో ఎంతో మేలు అని చెబుతున్నారు.తాజా మునగ ఆకుల్లో సి, ఇ విటమిన్లు రెండూ ఉంటాయి. ఇవి మెదడు పనితీరు మెరుగుపడటానికి తోడ్పడతాయి. జ్ఞాపక శక్తి తగ్గిపోకుండా కాపాడతాయి. ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచేందుకు వీలు కల్పిస్తాయి.మునగ ఆకుల్లో ఉండే కొన్ని రసాయన సమ్మేళనాలు, ఇ, సి విటమిన్లు శరీరంలో నుంచి విష/వ్యర్థ పదార్థాలను బయటికి పంపేస్తాయి. ఇది అంతిమంగా మన కాలేయంపై ఒత్తిడి తగ్గించి, అది ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.మునగ ఆకుల్లో ఏ, సి, ఇ విటమిన్లు, కాల్షియం, పొటాషియం, ఐరన్‌ వంటి కీలక ఖనిజాలు ఉంటాయి. మన శరీరానికి అవసరమైన పోషకాలలో కొంతమేర మునగ ఆకుల ద్వారా సమకూరుతుంది. మొత్తం ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img