నందమూరి బాలకృష్ణ, బాబీ కొల్లి కాంబినేషన్ లో వచ్చిన ‘డాకు మహారాజ్’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. తాజాగా ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నాలుగు రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా రూ.105 కోట్లు (గ్రాస్) రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వెల్లడించింది. ‘కింగ్ ఆఫ్ సంక్రాంతి’ అంటూ ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అలాగే ఈ మూవీని రేపటి నుంచి తమిళంలోనూ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. డాకు మహారాజ్’కు మొదటి రోజైన ఆదివారం నాడు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.56 కోట్లకు పైగా వసూళ్లు రావడంతో బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన సినిమాగా నిలిచింది. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ బాణీలు అందించారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్, ఊర్వశి రౌతేలా, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలుగా నటించారు.