రాజధాని అమరావతి కోసం ఉద్యమం సమయంలో మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. నందిగం సురేష్ పై మహిళ మహాలక్ష్మి ఫిర్యాదుతో 2020 ఫిబ్రవరిలో అమరావతి పోలీస్ స్టేషన్ లో కేసునమోదు అయింది. నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి సహా పలువురిపై కేసు..గత వైసీపీ ప్రభుత్వంలో నిందితులను అరెస్టు చేయలేదు పోలీసులు. బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు నందిగం సురేష్ న్యాయవాదులు.