HomePoliticalదుబాయ్ క్రికెట్ స్టేడియంలో..నారా లోకేష్‌

దుబాయ్ క్రికెట్ స్టేడియంలో..నారా లోకేష్‌

ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ టీమిండియా-పాకిస్తాన్ మ్యాచ్ కు హాజరయ్యారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు చిరకాల ప్రత్యర్థులు భారత్-పాక్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు వేదికైన దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నారా లోకేశ్ సందడి చేశారు. ఆయన వెంట కుమారుడు నారా దేవాన్ష్ కూడా ఉన్నాడు. వీరిరువురు టీమిండియా జెర్సీలు ధరించి… త్రివర్ణ పతాకం చేతబూని… భారత ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. ముఖ్యంగా, భారత క్రికెట్ వ్యవస్థ రథ సారథి, ఐసీసీ చైర్మన్ జై షాను నారా లోకేశ్ నేడు దుబాయ్ లో కలిశారు. జై షాను కలవడం సంతోషం కలిగించిందని, ఏపీలో క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చించామని నారా లోకేశ్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఏపీలో క్రికెట్ అభివృద్ధి పట్ల తనతో పాటు జై షా కూడా ఆసక్తిగా ఉన్నారని వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img