ఏపీ మంత్రి నారా లోకేశ్ తన భార్య బ్రహ్మణి, కుమారుడు దేవాన్ష్ లతో కలిసి మహా కుంభమేళాకు వెళ్లారు. ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి వారణాసికి వెళ్లారు. అక్కడ కాలభైరవ ఆలయాన్ని దర్శించుకున్నారు. కాసేపట్లో కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని సందర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం విశాలాక్షి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 5.25 గంటలకు వారణాసి నుంచి విజయవాడకు పయనమవుతారు. ఈ నెల 26 వరకు మహా కుంభమేళా జరగనుంది. ఇప్పటికే 50 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. పాకిస్థాన్ నుంచి కూడా హిందువులు కుంభమేళాకు రావడం విశేషం.