HomeEntertainmentరాపో22 కోసం..నేష‌న‌ల్ అవార్డు విన్నింగ్ టెక్నీషియ‌న్

రాపో22 కోసం..నేష‌న‌ల్ అవార్డు విన్నింగ్ టెక్నీషియ‌న్

హీరో రామ్ కొత్త సినిమా కోసం కొత్త కొత్త టెక్నీషియ‌న్స్ ఈ చిత్రంలో జాయిన్ అవుతున్నారు. రామ్ న‌టిస్తున్న చిత్రం రాపో22.ఈ చిత్రాన్ని మ‌హేశ్ బాబు డైరెక్ట్ చేస్తున్నాడు,హీరోయిన్ గా భాగ్య శ్రీ బోర్సే ఫీ మేల్‌ లీడ్ రోల్‌ పోషిస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అయింది. కాగా రామ్‌ ఈ సినిమా కోసం కొత్త కొత్త టెక్నీషియన్స్‌ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడని తెలిసిందే. ఇప్పటికే న్యూ సౌండ్ ఆఫ్‌ తెలుగు సినిమాకు స్వాగతం అంటూ కోలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్ల ద్వయం వివేక్-మెర్విన్‌ టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. మరోవైపు మేరిక్రిస్మస్‌, మలైకొట్టై వాలిబన్‌తోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలకు పనిచేసిన సినిమాటోగ్రఫర్‌ మధు నీలకందన్‌ ఈ మూవీకి పనిచేయబోతున్నట్టు తెలియజేశాడు. తాజాగా నేషనల్ అవార్డు విన్నింగ్‌ టెక్నీషియన్‌ (ఎడిటర్‌) అక్కినేని శ్రీకర్‌ ప్రసాద్‌ను టీంలోకి తీసుకున్నట్టు ప్రకటించారు. ఈయన ఏడు సార్లు నేషనల్ అవార్డు అందుకోవడం విశేషం. ఈ చిత్రాన్ని టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్‌ హౌజ్‌ మైత్రీ మూవీ మేకర్స్‌ తెరకెక్కిస్తోంది.

https://twitter.com/MythriOfficial/status/1864167979547492435

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img