జాతీయ ఆరోగ్య మిషన్ ను మరో 10 ఏళ్లు పొడిగిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మిషన్ ను 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక, సాంకేతిక పరిజ్ఞానం మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 60:40గా ఉండగా.. సిక్కింతో సహా ఈశాన్య రాష్ట్రాలకు 90:10 శాతంగా నిధులు వెచ్చిస్తున్నారు.