HomeSportsStory ..సై ప‌దెం..నీదా ..నాదా

Story ..సై ప‌దెం..నీదా ..నాదా

సంక్రాంతి అంటేనే నాటు కోడిపుంజులు కోడిపందాలతో మొదలవుతుంది ఈ పెద్ద పండుగ‌. మ‌రి సంక్రాంతికి కోడిపుంజులు సిద్ధమవ్వాలంటే మూడు నెలల ముందు నుంచి కూడా కోడిపుంజుకి ఏమి ఫుడ్ పెడతారు ఏ విధంగా పెంచుతారో చూద్దాం..

సంక్రాంతికి కోళ్లు సిద్ధం అవ్వాలంటే మూడు నెలల ముందు నుంచి కూడా వాటికి ఎక్సర్ సైజ్ టైం కి బాదం , పిస్తా ఇలా ప్రోటీన్ ఫుడ్ ప్రతిరోజు కూడా కోడికి అందించినట్లయితే పందెం సమయానికి చాలా గట్టిగా ఎగిరి పందెం కొట్టే విధంగా తయారవుతాయ‌ని కోళ్లు పెంచే వారు చెబుతున్నారు. తూర్పుగోదావరి నుంచి కొన్ని జాతి కోళ్ళను తీస్తారు. వాటిలో పెరు, పెరు క్రాష్, మెట్టు, రిచ్ మెట్టు పుంజులు తీసుకొచ్చి వాటి ద్వారా ఉత్పత్తి చేస్తారు. పెరు బ్రీడ్ కోడి పుంజుకు ఎక్కువగా ఎగిరే సామర్థ్యం ఉంటుంది. అందుకే వాటిని ఎక్కువ‌గా కొంటుంటార‌ట పందెం రాయుళ్లు..అయితే దీనికి ఎముకల బలం తక్కువగా ఉంటుందని, నాటు కోడికి, పెరు జాతి కోడి ద్వారా ఒక క్రాస్ బ్రీడ్ తయారు చేశారు. అదే పెరు క్రాస్‌. ఈ పెరుక్రాస్‌ కోళ్ల పందెంలో గట్టిగా నిలబడుతుందట‌.ప్రస్తుతం పెరు జాతి కోడి రూ.1,50,000, పెరు క్రాస్ జాతి కోడి రూ.1,00,000, రిచ్ మెట్టు రూ.80,000, మెట్టు రూ.70,000గా విక్రయిస్తున్నారు.మ‌రి పందెంలో కోడి గెలిస్తే రెట్టింపు లాభం కూడా వ‌స్తుంద‌ట‌.

అందుకే సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడిపందేలు వేయడానికి పుంజుల కోసం పందెపురాయుళ్లు వేట ప్రారంభించారు. పందెపు కోళ్లపెంపకం వృత్తిదారులూ కొనుగోలుదారులను ఆకట్టుకునే విధంగా తయారు చేస్తున్నారు. రూ.లక్షల్లో పందెం కాచేవారు ఏలూరు, ఒంగోలు, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతలకు వెళ్లి మేలు జాతి పుంజులను తెచ్చుకుంటారు. కొందరు ఔత్సాహికులు విదేశీ పుంజులను సైతం పందేలకు సిద్దం చేస్తున్నారు. పల్లెటూర్లలో ఒక్కో పుంజు రూ.10-20వేలు, ప్రత్యేక శిక్షణ, పోషణ పొందిన పందెపుకోళ్లు ఒక్కొక్కటి రూ.లక్ష వరకు పలుకుతున్నాయి. పందెం కోళ్ల పెంపకం అంటే ఏదో ఆహారం పెట్టేస్తే సరిపోతుందనుకుంటే చాలా పొరపాటు. వీటికి మంచి బలవర్థకమైన ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతీ రోజు వీటి మెనూలో జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. రోజూ కోడిగుడ్డు కూడా ఇస్తారు. అంతేకాదు కొన్నింటికి మటన్‌ను ఆహారంగా తప్పక ఉండాల్సిందే కోడి బలంగా తయారయ్యేందుకు ఈ ఆహారం ఎంతగానో దోహదపడుతుందట‌. సీజన్‌ను బట్టి పందెం కోళ్ళు గుడ్లు పెట్టేందుకు ప్రత్యేక విధానాలను అనుసరిస్తున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img