సూపర్ స్టార్ నటి నయనతార పై .. నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ రూపొందించింది. నవంబర్ 18వ తేదీన ఆ డాక్యుమెంటరీని ప్రసారం చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఆ రోజే నయనతార 40వ పుట్టిన రోజు జరుపుకోనున్నది. నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్ అనే టైటిల్‌తో డాక్యుమెంటరీని రిలీజ్ చేస్తున్నారు. సాధారణ జీవితం నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యున్నత స్థాయి నటిగా ఎలా ఎదిగారన్న కోణంలో డాక్యుమెంటరీని రూపొందించారు. నటి నయనకు చెందిన ఎన్నో తెలియని విషయాలను దాంట్లో చూపించనున్నారు. యువత తమ కలలను ఎలా సాకారం చేసుకోవాలన్న సందేశాన్ని ఆమె ఇవ్వనున్నారు. కూతురిగా, సోదరిగా, భాగస్వామిగా, తల్లిగా, స్నేహితురాలిగా ఎలా నయనతార తన జీవితంలో రాణించిందో ఆ డాక్యుమెంటరీలో చూపించనున్నారు.