హీరో నాని రీసెంట్‌గా కోర్ట్ సినిమాతో మరో హిట్‌ని ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం హిట్ 3. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ హిట్ నుంచి వస్తున్న 3వ చిత్రమిది. ఈ చిత్రంలో నాని కథానాయకుడిగా నటించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు. శైలేశ్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుండగా.. మే 01న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ఓటీటీ రైట్స్‌కి సంబంధించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.54 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్‌గా మారాయి. సినిమా సినిమాకు నాని డిమాండ్ పెరుగుతుండడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్‌గా కోర్ట్ హిట్టవ్వడం, ఇప్పుడు ఓటీటీ డీల్ చూస్తుంటే నాని పట్టిందల్లా బంగారమవుతుందని టాక్ వినిపిస్తుంది. ఇక హిట్ 3 విషయానికి వస్తే.. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌తో రానున్న ఈ సినిమాలో నాని అర్జున్ సర్కార్ అనే పవర్‌ఫుల్ ఐపీఎస్ అధికారిగా కనిపించనున్నారు.