HomeEntertainmentనిధికి.. సోష‌ల్ మీడియాలో వేధింపులు

నిధికి.. సోష‌ల్ మీడియాలో వేధింపులు

సోషల్‌ మీడియా ద్వారా వేధింపులు పెరిగిపోతున్నాయి. సామాన్యులతోపాటు పలువురు సెలబ్రిటీలు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారు. మొన్నటికి మొన్న మలయాళీ బ్యూటీ హనీరోజ్‌.. సోషల్‌ మీడియా ద్వారా తనను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో నటికి కూడా అదే పరిస్థితి ఎదురైంది. నిధి అగర్వాల్ సోషల్‌ మీడియాలో వేధింపులు ఎదుర్కొంది. ఈ విషయంపై సైబర్‌ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోషల్‌ మీడియా ద్వారా తనను ఇబ్బందికి గురిచేస్తూ, వేధిస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు తనను చంపేస్తానంటూ బెదిరింపు కామెంట్స్ పెడుతున్నట్లు తెలిపింది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. నటి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు.నిధి అగర్వాల్‌ ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్ట్స్‌ చేస్తోంది. ఇద్దరు సూపర్‌స్టార్లతో రెండు పాన్‌ ఇండియా చిత్రాల్లో మెరిసేందుకు సిద్ధమైంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ తో ‘హరిహర వీరమల్లు’, పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ ‘రాజా సాబ్‌’ లో నటిస్తోంది. ఈ రెండు పాన్‌ఇండియా సినిమాలూ 2025లోనే విడుదల కానున్నాయి. ఇక ఈ రెండు చిత్రాలతోపాటు తెలుగు, తమిళంలో మరికొన్ని సర్‌ప్రైజింగ్‌ మూవీస్‌లో నటిస్తోంది ఈ ఇస్మార్ట్‌ భామ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img