ప్రస్తుతం నిఖిల్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. తాజాగా ఈ యంగ్ హీరో తెలంగాణ గవర్నర్ ను ప్రత్యేకంగా కలిశాడు.తె లంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను ప్రత్యేకంగా కలిశారు. ఈ విషయాన్ని అతనే సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. గవర్నర్ తో భేటీకి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులైన జిష్ణు దేవ్ వర్మ జీతో సమావేశం ఎంతో అద్భుతంగా సాగింది. సినిమా నుంచి జాతీయ ఐక్యత వరకు వాటికి సంబంధించిన వివరాల గురించి ఆయన మాట్లాడారు. దీన్ని సాకారం చేసినందుకు అమరవాణి ఫౌండేషన్, మదన్ గోసావి జీ, సాకేత్ జీ అండ్ కృష్ణ చైతన్యలకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశాడు నిఖిల్. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.