నీతి ఆయోగ్ తన ‘విక్షిత్ భారత్ 2047’ విజన్ కింద విశాఖను కీలక గ్రోత్ హబ్ గా ఎంపిక చేసింది. ముంబై, సూరత్, వారణాసిలతో పాటు ఐటీ, టూరిజం, అగ్రికల్చర్ వంటి రంగాల్లో ఈ నగరం ప్రధాన అభివృద్ధికి సిద్ధమైంది. ఏపీకి ఉజ్వల భవిష్యత్తు రానుంది.కూటమి ఆధ్వర్యంలో పలు అభివృద్ధికార్యక్రమాలు జరగనున్నాయి.పలు పరిశ్రమలు విశాఖకి తరలిరానున్నాయి.విక్షిత్ భారత్@2047 అనేది భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన 100వ సంవత్సరమైన 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే భారత ప్రభుత్వ దృష్టి. ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతి, పర్యావరణ సుస్థిరత మరియు సుపరిపాలనతో సహా అభివృద్ధి యొక్క వివిధ అంశాలను దృష్టిలో కలిగి ఉంటుంది.