ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమవుతున్నారు. తొలుత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో, ఆ తర్వాత కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. తాజాగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై ఆయనతో చర్చించారు. ఈ సమావేశంలో చంద్రబాబుతో పాటు కూటమి ఎంపీలు కూడా పాల్గొన్నారు.
చంద్రబాబుతో సమావేశంపై నితిన్ గడ్కరీ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కొనసాగుతున్న జాతీయ రహదారుల అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష చేపట్టామని వెల్లడించారు.ఈ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారని గడ్కరీ వెల్లడించారు.