గేమ్ ఛేంజర్ నుండి మరో సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్ .. ఈ మూవీ నుంచి ‘ధోప్’ అనే పార్టీ సాంగ్‌ను డిసెంబర్ 21న రిలీజ్ చేయునున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా సాంగ్ ప్రోమోను పంచుకున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ మూవీ గేమ్ ఛేంజర్ . తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. కార్తీక్ సుబ్బరాజు కథను అందిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ మూవీ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఆచార్య సినిమా వచ్చిన ఈ సినిమా డిజాస్టార్ అవ్వడంతో వారి ఆశలన్నీ ప్రస్తుతం వస్తున్న గేమ్‌ఛేంజర్ పైనే ఉన్నాయి. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.