టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళులు అర్పించారు. శనివారం ఉదయం అన్న కల్యాణ్ రామ్‌తో కలిసి హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్న ఎన్టీఆర్.. తాత సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో వారి అభిమానులు ఎన్టీఆర్ ఘాట్‌కు తరలివచ్చారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు నివాళులర్పించారు. ఇక, సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఏపీ మంత్రి నారా లోకేశ్ తదితరులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించానున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు.