ఏపీ మాజీ సీఎం జగన్కు పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు, అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో స్పష్టంగా వెల్లడైందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఈ అవినీతి కేసుతో అదానీ దేశం పరువు, జగన్ రాష్ట్రం పరువు తీశారని ఆక్షేపించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.ఇలాంటి నీచాలకి పాల్పడిన వారిని అంత తేలికగా వదిలిపెట్టకూడదని అన్నారు.