2022లో వచ్చిన ఓదెల రైల్వేస్టేషన్ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఓదెల-2పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ప్రముఖ డైరెక్టర్ సంపత్ నంది కథ అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అకోశ్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ టీజర్‌ను తాజాగా మేకర్స్ మహాకుంభ మేళాలో విడుదల చేశారు. తమన్నా లేడీ అఘోరాగా కనిపించిన ఈ టీజర్ ఉత్కంఠ రేకేత్తించే సన్నివేశాలతో ఆకట్టుకుందనే చెప్పాలి. శివశక్తిగా తమన్నా నటన ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా సాగింది. సంపత్ నందితో కలిసి మధు క్రియేషన్స్ పతాకంపై డి. మధు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజనీశ్ లోక్‌నాథ్ బాణీలు అందిస్తున్నారు.