HomeEntertainmentనిర్మాత‌గా నాని..హీరోగా మెగాస్టార్

నిర్మాత‌గా నాని..హీరోగా మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి న‌టించే త‌దుప‌రి చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించేంది శ్రీకాంత్ ఓదెల అని అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. మ‌రో విశేషం ఏంటంటే ఈ చిత్రాన్ని నేచుర‌ల్ స్టార్ నాని నిర్మించ‌నున్నారు. సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌తో క‌లిసి నాని త‌న‌ యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్ర‌క‌టిస్తూ మేక‌ర్స్ ఓ స్పెష‌ల్‌ పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రక్తం కారుతున్న చిరు చేతిని చూపించారు. దీనికి ‘అతను హింసలో శాంతిని పొందుతాడు’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఆయన స్ఫూర్తితోనే నేను పెరిగాను. ప్రతిసారి ఆయన కోసం గంటల తరబడి లైన్‌లో నిలబడ్డాను. ఈ క్రమంలో నా సైకిల్ కూడా కోల్పోయాను. ఆయనతోనే సెలబ్రేషన్స్ చేసుకున్నాను. ఇప్పుడాయనని సమర్పిస్తున్నాను. ఇది ఫుల్ సర్కిల్” అంటూ నాని ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img