HomePoliticalఓపెన్ ఆఫ‌ర్..ప్ర‌జ‌ల చేతికే ప‌వ‌ర్

ఓపెన్ ఆఫ‌ర్..ప్ర‌జ‌ల చేతికే ప‌వ‌ర్

ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు తీసుకునే కొన్ని నిర్ణ‌యాలు ఆస‌క్తిగా ఉంటాయి.ఇప్పుడ‌దే త‌ర‌హాలో ప్ర‌జ‌ల చేతికే ఓ ఆఫ‌ర్ ని ప‌వ‌ర్ ని ఇవ్వ‌డం ఆస‌క్తిరేపుతోంది. ఇసుక అక్రమ దందా చేసినా.. మద్యం అధిక ధరకు విక్రయించినా తిరగబడాలని ప్రజలకు పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి. అంతేకాదు.. ఇసుక మద్యం దందాల్లో జోక్యం చేసుకోవద్దని టీడీపీ శ్రేణులకూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.. మంగళగిరిలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పలు విషయాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.. ఎవరూ ఇసుక వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని క్లియర్‌ కట్‌ ఇన్‌స్ట్రక్షన్‌ ఇచ్చారు.

ఇసుక అక్రమ దందా చేసేవాళ్లపై తిరుగుబాట చేయాలని ప్రజలకు పిలుపినిచ్చారు.. ఇక బాటా తరహాలో ఏపీలో మద్యం రేటు రూ 99కి ఫిక్స్డ్‌. అంతకు మించి ఒక్క పైసా వసూల్‌ చేసినా కఠినచర్యలు తప్పవని స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఎమ్మార్పీపీకి కన్నా ఒక్కపైసా కూడా ఇవ్వొద్దని మందుబాబులకు సూచించారు.మద్యం, ఇసుక అక్రమాలను కట్టడి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు సీఎం చంద్రబాబు . ఏమాత్రం అవినీతికి తావులేకుండా పకడ్బందీ పాలసీలను అమలు చేస్తామన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలునిచ్చిన చంద్రబాబు.. టీడీపీ సభ్యత్వం సమాజంలో ఓ గుర్తింపులాంటిదన్నారు. పనితీరుతోనే 2029లో అధికారంలోకి వస్తామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img