HomeEntertainmentఓటీటీ..థియేట‌ర్ లో ఈ వారం సినిమాలు

ఓటీటీ..థియేట‌ర్ లో ఈ వారం సినిమాలు

పుష్ప సినిమాతో డిసెంబ‌ర్‌లో బాక్సాఫీస్ రికార్డులు బ‌ద్ద‌ల‌వుతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా ఎఫెక్ట్‌తో గ‌త‌వారం ఏ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాలేదు. అయితే ఈ వారం థియేట‌ర్‌లో కొత్త చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. అలానే ఓటీటీలోనూ కొత్త సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. అవేంటి అని చూసుకుంటే..?

అల్ల‌రి న‌రేష్ బ‌చ్చ‌ల‌మ‌ల్లి

న‌టుడు అల్లరి న‌రేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘బ‌చ్చల మ‌ల్లి . ఈ సినిమాకు సుబ్బు మంగాదేవి దర్శక‌త్వం వ‌హిస్తుండ‌గా.. హాస్యా మూవీస్ పతాకంపై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. ఇందులో నరేష్‌కి జోడీగా అమృత అయ్యర్ కనిపించ‌నుంది. ఈ మూవీని డిసెంబ‌ర్ 20న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు మేక‌ర్స్.

ఉపేంద్ర ‘UI’

క‌న్న‌డ రియ‌ల్ స్టార్ ఉపేంద్ర స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న తాజా చిత్రం ‘UI’. దాదాపు 8 ఏండ్ల‌ గ్యాప్ త‌ర్వాత ఈ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు ఉపేంద్ర‌. మనోహరన్- శ్రీకాంత్‌ కేపి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్రకు జోడీగా రీష్మా నానయ్య నటిస్తుంది. కాంతర ఫేమ్‌ అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌ల చేసిన గ్లింప్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఈ చిత్రం క్రిస్మస్‌ కానుకగా డిసెంబరు 20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

విడుద‌ల పార్ట్ 2

ఇటీవ‌ల మ‌హారాజ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు త‌మిళ క‌థానాయ‌కుడు మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి. ఆయ‌న హీరోగా వ‌స్తున్న తాజా చిత్రం ‘విడుత‌లై 2’. కోలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు వెట్రి మార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ‘విడుతలై పార్ట్‌-1’. క‌మెడియ‌న్ సూరి, విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన ఈ చిత్రం మంచి విజ‌యాన్ని అందుకోవ‌డ‌మే కాకుండా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఇదే సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌గా రాబోతుంది ఈ చిత్రం. ఈ సినిమా కూడా క్రిస్మ‌స్ కానుక‌గా.. డిసెంబ‌ర్ 20న విడుద‌ల కానుంది.

సారంగపాణి జాతకం

బ‌లగం, 35 సినిమాల‌తో మంచి విజయాల‌ను ఖాతాలో వేసుకున్న న‌టుడు ప్రియదర్శి. ఆయ‌న ప్రధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా చిత్రం సారంగపాణి జాతకం. ఈ సినిమాకు మోహనకృష్ణ ఇంద్రగంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. శ్రీదేవి మూవీస్ బ్యాన‌ర్ ఈ సినిమాను నిర్మిస్తుంది. రూప కొడువాయూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ సినిమా డిసెంబ‌ర్ 20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ వారం ఓటీటీ చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!

ఆహా

జీబ్రా – డిసెంబరు 20

నెట్‌ఫ్లిక్స్‌

లవ్‌ టూ హేట్‌ ఇట్‌ జూలియస్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 17

ఇనిగ్మా (హాలీవుడ్‌) డిసెంబరు 17

వర్జిన్‌ రివర్‌ 6 (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 19

ది డ్రాగన్‌ ప్రిన్స్‌ (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 18

స్టెప్పింగ్‌ స్టోన్స్‌ (డాక్యుమెంటరీ మూవీ) డిసెంబరు 18

ద సిక్స్‌ ట్రిపుల్‌ ఎయిట్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 20

యోయో హనీసింగ్‌ (ఫేమస్‌ హిందీ డాక్యుమెంటరీ) డిసెంబరు 21

జియో సినిమా

ట్విస్టర్స్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 18

మూన్‌వాక్‌ (హిందీ) డిసెంబరు 20

తెల్మా (హాలీవుడ్‌) డిసెంబరు 21

ఈటీవీ విన్‌

లీలా వినోదం (తెలుగు) డిసెంబరు 19

అమెజాన్‌ ప్రైమ్‌

బీస్ట్‌ గేమ్స్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 18

గర్ల్స్‌ విల్‌ బీ గర్ల్స్ (హిందీ) డిసెంబరు 18

లయన్స్‌ గేట్‌ ప్లే ఓటీటీలో

బాయ్‌ కిల్స్‌ వరల్డ్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 20

మనోరమా మ్యాక్స్‌ ఓటీటీలో

పల్లొట్టీ నైన్టీస్‌ కిడ్స్‌ (మలయాళం) డిసెంబరు 18

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read