చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా జరుగుతున్న భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటింగ్ మందకొడిగా సాగుతున్నది. 25.2 ఓవర్లలో పాకిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. ప్రస్తుతం సౌద్ షకీల్, కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం మహ్మద్ రిజ్వాన్ 53 బంతుల్లో 24 పరుగులు, షకీల్ 52 బంతుల్లో 37 పరుగులతో క్రీజులు ఉన్నారు. 25వ ఓవర్ ముగిసే సరికి పాకిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి.. 107 పరుగులు చేసింది. పాక్ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌లో 41 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్ మొదటి బంతికే బాబర్ ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత బంతికే బాబర్ వికెట్ కీపర్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. బాబర్ 26 బంతుల్లో ఐదు ఫోర్ల సహాయంతో 23 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. పదో ఓవర్‌లో మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ పెవిలియన్‌కు చేరాడు. అక్షర్ పటేల్ విసిరిన బంతి డైరెక్ట్ వికెట్లకు తాకడంతో రన్ అవుట్ అయ్యాడు. ఇమామ్ 26 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేశాడు.