బాలీవుడ్ కు గ్లామర్ అద్దిన నటి..హీరోయిన్ కు అదా నేర్పిన భామ పర్వీన్ బాబి. వెండి తెరపై పర్వీన్ విసిరిన చూపులను..ఒలికించిన నవ్వులను ఏరికోవడానికి అప్పట్లో యువత థియేటర్లకు పరుగులు పెట్టేది. అప్పటి బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ పర్వీన్ ఆరాదకులు తక్కువేం కాదు. అటిట్యూడ్..ప్లూయెంట్ ఇంగ్లీష్.. కంప్లీట్ క్లారిటీతో పర్వీన్ బాబి ఉత్తుంగ తరంగం మోడలింగ్ నుంచి బాలీవుడ్ కి అడుగు పెట్టింది. తొలి సినిమా ప్లాప్.కానీ నిర్మాతలు ఆమె కోసం క్యూ కట్టేవారు. కాల్షీట్ల కోసం పోటీ పడేవారు. పర్వీన్ బాబి అందం అలాంటింది మరి. ఆమె రాకతో బాలీవుడ్ కి కొత్త శోభ తోడైంది. నటిగా ఓ వెలుగు వెలిగింది. అలాగే ప్రేమాయణాలు నడపడంలోనూ అంతే సంచలమైంది. అప్పట్లోనే లివ్ ఇన్ రిలేషన్ షిప్ లు నెరిపిన నటి. విదేశీ పత్రికలు సైతం పర్వీన్ గురించి ఎన్నో సంచలన కథనాలు ప్రచురించాయి. అలా వరల్డ్ అంతా కూడా ఫేమస్ అయింది. 70-80వ దశకంలో బాలీవుడ్ నే ఏలిన నటి. అలాంటి సంచలన నటి జీవిత కథ ఇప్పుడు వెండి తెరకు ఎక్కబోతుంది. కొంత కాలంగా పర్వీన్ బయోపిక్ తెరకెక్కుతోందంటూ ప్రచారం జరుగుతోంది. కానీ అందులో వాస్తవం కనిపించలేదు. అయితే ఇప్పుడామె కథను సినిమాగా కాకుండా వెబ్ సిరీస్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఆమె పాత్రలో నటించడానికి బాలీవుడ్ యువ సంచలనం త్రిప్తీ డిమ్రీని ఎంపిక చేసారు.పర్వీన్ బాబి పీచర్లు కొన్ని త్రిప్తీలో ఉన్నాయనే కాన్పిడెన్స్ తో షోనాలి ఎంపిక చేసినట్లు చెబుతున్నారు.