పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు ఒక ప్రభంజనం. ఆయనకి దేశ వ్యాప్తంగానే కాదు విదేశాలలోను విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.సినిమాలు తగ్గించి రాజకీయాలలోకి వచ్చిన కూడా పవన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఏపీ డిప్యూటీ సీఎం పదవి పవన్ కళ్యాణ్‌కి దక్కడంతో తమ అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. అయితే ఈ పదవి దక్కించుకున్నప్పటి నుండి పవన్ కళ్యాణ్ చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. పలు ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటూ ఎవరికి ఏ సాయం వచ్చిన కూడా తాను ఉన్నాననే భరోసా ఇస్తున్నాడు. పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్‌ని ఒక్కసారైన కలవాలని, వీలుంటే అతనితో కలిసి సెల్ఫీ దిగాలని ఎంతో మంది అభిమానులు కలలు కంటారు. పవన్ కళ్యాణ్ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటారు. పవన్ బర్త్ డే సందర్భంగా అన్నదానాలు, రక్తదానాలు, పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు.
అయితే తాజాగా ఓ పవన్ కళ్యాణ్ అభిమాని రక్తంతో తన అభిమాన నటుడి ఫొటో గీయడం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి వెంకట హరిచరణ్ రక్తంతో పవన్ కళ్యాణ్ చిత్రం గీశాడు. రాజమండ్రి జైల్ రోడ్‌లో శుక్రవారం జరిగిన అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమానికి పవన్ వస్తారని అందరు భావించారు.అయితే చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడంతో మంత్రి కందుల దుర్గేష్, డిప్యూటీ స్పీకర్ రఘురామ, ఎమ్మెల్యే ఆదిరెడ్డికి ఆ ఫోటోని అందజేశారు. తాను పవన్ కళ్యాణ్ వీరాభిమాని అని, ఆయన జన్మదినం సందర్భంగా రక్తదానం చేసినప్పుడు కొంత రక్తంతో ఈ చిత్రాన్ని వేసినట్టు ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పిక్ చూసిన వాళ్లందరు పవన్ అభిమానిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన హరిహర వీరమల్లు చిత్రంతో త్వరలో పలకరించబోతున్నాడు. ఆ తర్వాత ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలతో ప్రేక్షకులని అలరించనున్నాడు.