ఆంద్రప్రదేశ్..సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కీలక సూచనలు చేశారు. వైసీపీ సభ్యులు అసెంబ్లీలో అసభ్య పదజాలంతో రెచ్చగొట్టినా సరే.. జనసేన సభ్యులు సంయమనం పాటించాలని చెప్పారు. రెచ్చిపోవద్దని హుందాగా వ్యవహరించాలని, బురదలో కూరుకుపోయిన వైసీపీ నాయకులు దాన్ని మనకు అంటించాలని చూస్తారని పేర్కొన్నారు.