సీనియర్ సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని కుంభమేళాలో ఆయన పుణ్యస్నానం ఆచరిస్తున్నట్లు ఆ ఫోటోలో ఉంది. ఎవరో ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. ఇది నిజమైన ఫోటోగా భావించిన కొందరు నెటిజన్లు ఆయనపై విమర్శలు చేశారు. నాస్తికుడినని చెప్పుకునే ప్రకాశ్ రాజ్ కుంభమేళాలో పుణ్యస్నానం చేయడం ఏమిటని కొందరు వ్యాఖ్యానించారు. ఈ ఫోటో ప్రకాశ్ రాజ్ దృష్టికి రావడంతో ఆయన స్పందించారు. అది నకిలీ వార్త అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలా చేయడం సిగ్గుచేటని ఆయన అన్నారు. దీనిపై ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులు పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు.