పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి అధికారులు 3,540 క్యూసెక్కుల గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు కుడికాలువకు విడుదల చేశారు.ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి సోమవారం 3,540 క్యూసెక్కుల గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు విడుదల చేశారు. ఈ ఏడాది వర్షాభావంతో పలుమార్లు ట్రయల్ రన్ మాత్రమే నిర్వహించారు. తాజాగా గోదావరి నీటిమట్టం 14 మీటర్లకు పైబడి ఉండడంతో కృష్ణా డెల్టాలకు సాగునీటి అవసరాల రీత్యా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 10 పంపులు 10 మోటార్లతో నీటిని విడుదల చేసినట్లు డీఈఈ పెద్దిరాజు తెలిపారు.