పోలవరం ప్రాజెక్ట్ ని జగన్ ప్రభుత్వం నాశనం చేసిందన్నారు నిమ్మల రామానాయుడు. పోలవరం ప్రాజెక్ట్ కు పెట్టిన ఖర్చు చూస్తే, 2014-19 మధ్య టిడిపి ప్రభుత్వం రూ.11,762 కోట్లు ఖర్చు పెడితే, 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం రూ.4,167 కోట్లు ఖర్చు పెట్టింది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతి చూస్తే, 2014-19 మధ్య టిడిపి ప్రభుత్వం 72% పనులు పూర్తి చేస్తే, 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం కేవలం 3.84% పనులు చేసింది. కేంద్రం ఇచ్చిన నిధులు మళ్లింపు చూస్తే టిడిపి ప్రభుత్వంలో సున్నా ఉంటే, వైసీపీ ప్రభుత్వంలో రూ.3,385 కోట్లు ఉంది.