దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ శైవక్షేత్రంగా పేరుగాంచిన శ్రీకాళహస్తిలో ఈ నెల 21 నుంచి మార్చి 6 వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. కాగా, ఈ బ్రహ్మోత్సవాలను ఈసారి అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలకు ప్రముఖులను స్వయంగా ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణల తదితరులను కలిసి ఆహ్వానించారు. తాజాగా బొజ్జల సుధీర్ రెడ్డి పాన్ ఇండియా హీరో ప్రభాస్ ను కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేశారు. తాము నిర్వహించే ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు.
