మహారాష్ట్రలో జరిగిన రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ ప్రమాదం తనను వేదనకు గురిచేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. పుష్పక్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయనే వదంతులతో ప్రయాణికులు చైన్ లాగి కిందకు దిగారు. అదే సమయంలో పక్క ట్రాకుపై వెళ్తున్న ట్రైన్ వారిపై నుంచి దూసుకెళ్లగా 12 మంది మృతిచెందారు.