HomePoliticalనారా లోకేష్ ని ఆట‌ప‌ట్టించిన.. ప్ర‌ధాని మోదీ

నారా లోకేష్ ని ఆట‌ప‌ట్టించిన.. ప్ర‌ధాని మోదీ

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓ సరదా ఫిర్యాదు చేశారు. విశాఖపట్నంలో నిన్న సాయంత్రం జరిగిన బహిరంగ సభకు ముందు గ్రీన్ రూంలో ప్రధానిని మంత్రులు ఆహ్వానించే క్రమంలో మోదీ, లోకేశ్ ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. మంత్రులకు నమస్కారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న మోదీ.. లోకేశ్ వద్ద ఆగారు. ఆయన నమస్కరించగానే మీ మీద ఒక ఫిర్యాదు ఉందని చెబుతూ అదేంటో మీకూ తెలుసు కదా? అని చమత్కరించారు. అనంతరం మళ్లీ మోదీనే మాట్లాడుతూ.. ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయిందని, ఇప్పటి వరకు ఢిల్లీ వచ్చి తనను ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. కుటుంబంతో వచ్చి తనను కలవాలని లోకేశ్ భుజం తట్టి చెప్పారు. స్పందించిన లోకేశ్.. ‘త్వరలోనే వచ్చి కలుస్తా సర్’ అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read