HomePoliticalథాయ్ లాండ్ ప్ర‌ధాని..ఆస్తులు ఎంతో తెలుసా

థాయ్ లాండ్ ప్ర‌ధాని..ఆస్తులు ఎంతో తెలుసా

థాయ్ లాండ్ ప్రధాని గా పెటోంగ్టార్న్ షినవ్రత గత ఏడాది ఆగస్టులో బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆమె మేనత్త ఇంగ్లక్ షినవ్రత తర్వాత థాయ్ లాండ్ ప్రధాని పీఠం అధిష్ఠించిన రెండో మహిళ గా పెటోంగ్టార్న్ షినవ్రత నిలిచారు. ఆమె తండ్రి తక్సిన్ షినవ్రత కూడా థాయ్ ప్రధానిగా వ్యవహరించారు. టెలికాం రంగ వ్యాపార దిగ్గజం అయిన తక్సిన్ షినవ్రత థాయ్ లాండ్ లోని టాప్-10 బిలియనీర్లలో ఒకరు. ఆయన చిన్న కుమార్తె పెటోంగ్టార్న్ షినవ్రత వయసు కేవలం 38 సంవత్సరాలే. తాజాగా, ఆమె ఆస్తులకు సంబంధించిన ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి.

ప్రధాని పెటోంగ్టార్న్ షినవ్రత తన ఆస్తుల విలువ రూ.3,430 కోట్లకు పైనే అని ప్రకటించారు. కొంతమేర అప్పులు కూడా ఉన్నాయట. జపాన్, బ్రిటన్ లోనూ ఈ మహిళా ప్రధానికి ఆస్తులు ఉన్నాయి. పెటోంగ్టార్న్ షినవ్రత ఫ్యాషన్ రంగాన్ని ఫాలో అవుతుంటారని తెలుస్తోంది. ఆమె వద్ద ఖరీదైన 200 డిజైనర్ బ్యాగులు, 75 లగ్జరీ వాచ్ లు, 67 నెక్లెస్ లు, 205 జతల చెవి కమ్మలు, 108 ఉంగరాలు, 6 బ్రేస్ లెట్లు, 167 ఫ్యాషన్ దుస్తులు ఉండడమే అందుకు నిదర్శనం. ఈ మేరకు తన ఆస్తుల వివరాలను ప్రధాని పెటోంగ్టార్న్ షినవ్రత జాతీయ అవినీతి వ్యతిరేక కమిషన్ కు సమర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img