HomeEntertainmentన‌య‌న‌తార‌కి షాక్ ఇచ్చిన‌..చంద్ర‌ముఖి నిర్మాత‌లు

న‌య‌న‌తార‌కి షాక్ ఇచ్చిన‌..చంద్ర‌ముఖి నిర్మాత‌లు

చంద్ర‌ముఖి మూవీ నిర్మాత‌లు స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార‌కి నోటీసులు ఇచ్చారు. చంద్రముఖి చిత్రంలోని కొన్ని క్లిప్పింగ్స్‌ను అనుమతి లేకుండా డాక్యుమెంటరీలో వాడుకున్నారంటూ చిత్ర నిర్మాతలు నెట్‌ఫ్లిక్స్‌తోపాటు నయన్‌కు నోటీసులు జారీ చేశారు. రూ.5 కోట్లు పరిహారం కింద చెల్లించాలని అందులో డిమాండ్‌ చేశారు. ఈ నోటీసులపై నయన్‌ ఇంకా స్పందించలేదు. నయన్‌.. ధనుష్‌ మధ్య గతకొంత కాలంగా వార్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. నయనతార పెళ్లితో పాటు ఆమె జర్నీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీని రూపొందించింది. ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే, ఈ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన ‘నేనూ రౌడీనే’ మూవీ షూటింగ్‌ క్లిప్పింగ్స్‌ని వాడుకున్నారు. ఆ క్లిప్పింగ్‌ను డాక్యుమెంటరీలో వాడుకునేందుకు అనుమతి లేకపోవడంతో రూ.10కోట్ల పరిహారం ఇవ్వాలని ధనుష్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు నయనతారకు లీగల్‌ నోటీసులు కూడా పంపారు. ఈ క్రమంలోనే ధనుష్‌ని లక్ష్యంగా చేసుకొని నయనతార ఓ బహిరంగ లేఖను విడుదల చేసింది. చట్టపరంగా తేల్చుకుంటానని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ధనుష్‌ కోర్టును ఆశ్రయించడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img