మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు నిర్మాత దిల్ రాజు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి చర్చించినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. రామ్ చరణ్ కొత్త సినిమా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించాలని భావిస్తున్నట్లు దిల్ రాజు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని పవన్ కల్యాణ్ ను ఆహ్వానించినట్లు తెలిపారు. దీనికి పవన్ ఓకే చెప్పారని వివరించారు.దిల్ రాజు, పవన్ ల భేటీపై గేమ్ ఛేంజర్ నిర్మాణ సంస్థ ట్విట్టర్ ద్వారా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపింది. కాగా, సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన గేమ్ ఛేంజర్ సినిమా విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.