HomeEntertainmentనిర్మాత వేద‌రాజు టింబ‌ర్..క‌న్నుమూత‌

నిర్మాత వేద‌రాజు టింబ‌ర్..క‌న్నుమూత‌

టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. నిర్మాత వేదరాజు టింబర్ కన్నుమూశారు. శుక్ర‌వారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 54 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో ఆయన బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో కొంత కాలంగా ఆయన చికిత్స పొందుతున్నారు. కోలుకుని, ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తారని అందరూ భావిస్తున్న తరుణంలో ఆయన కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు ఈరోజే జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వేదరాజు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. మడత కాజా’, ‘సంఘర్షణ’ వంటి చిత్రాలను వేదరాజు నిర్మించారు. కన్స్ట్రక్షన్ రంగంలో బిజీగా ఉంటూనే… సినిమాలపై ఇష్టంతో ఆయన నిర్మాతగా మారారు. మరో చిత్ర నిర్మాణానికి సన్నాహకాలు జరుగుతున్న సమయంలోనే ఆయన మృతి చెందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read