గత నాలుగేళ్లుగా పుష్ప మేనియా ఏ రేంజిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప, పుష్ప-2 సినిమాలతో అల్లు అర్జున్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ రెండు సినిమాలతో బన్నీకి దేశ విదేశాల్లో అభిమానులు ఏర్పడ్డారు. మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ అతడికి ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఓ అభిమాని కుంభమేళాలో అచ్చం పుప్ప రాజ్ లా డ్రెస్సప్ అయి వచ్చాడు. పుష్ప గడ్డం, పుష్ప స్టయిల్, పుష్ప మేనరిజంతో ఆకట్టుకున్నాడు. ఆ అభిమాని మహారాష్ట్రకు చెందిన వాడు.ప్రయాగ్ రాజ్ వచ్చిన అతగాడు పుష్ప-2 సినిమాలోని డైలాగులు చెబుతుంటే… కుంభమేళా భద్రతా విధుల్లో ఉన్న పోలీసులు కూడా ఎంజాయ్ చేశారు. వారు అతడిని అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.