సీనియర్ నటి పావలా శ్యామల పరిస్థితి తెలుసుకున్న పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశ్ జగన్నాథ్ ఆమెని అర్థిక సాయాన్ని అందించాడు. ప్రస్తుతం శ్యామల ఉంటున్న ఉషా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సోసైటీకి వెళ్లిన ఆకాశ్ శ్యామలను కలిసి ఆమె బాగోగులు తెలుసుకున్నాడు. అనంతరం లక్ష రూపాయలు చేతికి అందించి.. ఏ కష్టం వచ్చిన తాను ఉన్నానంటూ భరోసాను అందించాడు ఆకాశ్. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.