ప్రతి మనిషి పుట్టి
శారీరకంగాపెరగడం
మానసికంగా ఎదగడం
మరణించి శాశ్వతంగా మరుగవ్వడం
అక్షర సత్య తత్వం!
ఆవనిలో అనివార్యం!!
విచక్షణ తో
వివేకం తో
విజ్ఞత తో
వినయం తో
విశాలమైన దృక్పథం తో
నీతి నిజాయితీ తో
బాధ్యతల తో
సమయస్ఫూర్తి తో
ధర్మం తో
సత్యం తో
శ్రమించే తత్వం తో
పారదర్శకం తో
దయ తో
విలువల తో
నిస్వార్థం తో
మాట పై నిలకడ తత్వం తో
అను నిత్యం ఆత్మ విమర్శ తో
తన మన తత్వం తో
సహాయ సహకారాల తో
పరిపూర్ణ స్నేహ గుణం తో
పొరపాట్లను సర్దుకునే గుణం తో
సమస్యలను సామరస్యంగా
పరిష్కరించుకొనే తత్వం తో
ఆధ్యాత్మిక చింతన తో
తల్లి తండ్రుల పట్ల గౌరవం తో
వారి అవసాన దశలో అండ తో
తోడు నీడగా ఆదరణ తో
వుండే తత్వం తో
ఆర్థికంగా, సాంజికంగా క్రమ శిక్షణ తో
విలువలు కలిగిన విద్య తో
ఆదర్శ ప్రయమైన ఆశయాలతో
ఆరోగ్యం పట్ల శ్రద్ధ తో
ఒదిగి ఎదిగితే
ఎదిగి ఒదిగితే
మరణించినా
జీవించాలంటే
జీవితాంతం తనను తను
ఇంటా బయట
సద్గుణాలతో సంచరించ వలసిందే!
ప్రతి రోజు తెలివైన వారికి
దేవుడిచ్చిన వరమే!
సద్వినియోగం చేసుకొంటే!
పై వన్నీ మనసా వాచా కర్మన
పాటిస్తే
పైకి ఎదగడం అని
నా అభిప్రాయం నా అనుభవం!
విశ్వం ఎరిగి ఎరగని అక్షర సత్యం
డా. కిడాంభీ!!!