సమస్యలను, సవాళ్ల ను ఎదురించి నిలబడిన యోధుడు రఘురామకృష్ణంరాజు. వేధింపులకు భయపడి ఉంటే నేడు ఈ స్థానానికి వచ్చేవారు కాదు. గత పాలకుల ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి రాఘరామ కస్టడీ టార్చర్ ఒక ఉదాహరణ. ప్రశ్నించిన సొంత పార్టీ ఎంపీని హింసించిన ఘటన దేశ రాజకీయాల్లో మరొకటి లేదు. రైలు భోగీ తగలబెట్టి అయినా ఎంపిని చంపాలని నాడు ఆలోచన చేశారు. రఘురామను నాడు రాష్ట్రానికి రానివ్వని వారు నేడు సభలోకి రాలేని, కూర్చోలేని పరిస్థితి వచ్చింది. ఇదే దేవుడు రాసిన స్క్రిప్ట్…ప్రజాస్వామ్య గొప్పతనం. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తే వచ్చేది…నాయకులు ఇచ్చేది కాదు. శాసన సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.