ఓటీటీ ప్రియులకు పరిచయం అక్కర్లేని వెబ్ సిరీస్‌లలో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఒకటి. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి లీడ్ రోల్‌లో నటించిన ఈ సిరీస్ రెండు భాగాలుగా వచ్చి అమెజాన్ ప్రైమ్‌లో రికార్డులు నమోదు చేసింది. స్పై, థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సిరీస్‌ను దర్శకద్వయం రాజ్ & డీకే తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ గత ఏడాది మేలో ప్రారంభమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ సిరీస్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు రాజ్ & డీకే ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ మ్యాన్ టీమ్‌తో దిగిన ఫొటోలను పంచుకున్నారు. ఈ ఫొటోలలో సమంత కూడా ఉండడం విశేషం. ఫస్ట్ సీజన్ టెర్రరిజం బ్యాక్‌డ్రాప్‌లో రాగా.. సెకండ్ సీజన్ శ్రీలంక రెబల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి హిట్ అందుకుంది. ఇక సెకండ్ సీజన్‌లో సమంత లీడ్ రోల్‌లో నటించడం విశేషం. అయితే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ఎక్కడైతే పూర్తైందో అక్కడి నుంచే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ మొదలవుతుందని మేకర్స్ తెలిపారు. సీజన్ 3 ఎక్కువగా నార్త్ ఈస్ట్ ఇండియాలో బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్నట్లు ప్రకటించింది.