రాజమౌళి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఎస్ఎస్ఎంబీ29 చేస్తున్న సంగతి తెలిసిందే. అసలే మహేష్ ఖాళీ దొరికితే ఫ్యామిలీలతో వెకేషన్స్ కు వెళ్తూ ఉంటారు. రాజమౌళితో సినిమా అనగానే వామ్మో ఆయనతో సినిమా చేస్తే తమ హీరో పరిస్థితేంటి అని మహేష్ ఫ్యాన్స్ అంతా అనుకున్నారు.సినిమా మొదలవగానే మహేష్ అన్ని ట్రిప్స్ కు బ్రేక్ వేస్తూ రాజమౌళి మహేష్ పాస్‌పోర్ట్ ను తీసుకుని తన దగ్గర పెట్టేసుకున్నాడు. దీంతో చేసేదేమీ లేక మహేష్ బాబు రాజమౌళి సినిమా షూటింగ్ తో బిజీ అయిపోయాడు. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్స్ షూటింగ్ కూడా అయిపోయింది.
ప్రస్తుతం షెడ్యూల్ బ్రేక్ రావడంతో మహేష్ బాబు కు రాజమౌళి కాస్త స్వేచ్ఛనిచ్చినట్టు తెలుస్తోంది. షెడ్యూల్ బ్రేక్ లో మహేష్ బాబు, కూతురు సితారతో కలిసి వెకేషన్ కు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. తన పాస్‌పోర్ట్ తన దగ్గరకు వచ్చేసిందని చూపిస్తూ మహేష్ బాబు ఎయిర్‌పోర్ట్ లో ఫోటోగ్రాఫర్లకు చూపిస్తూ చాలా జాలీ మూడ్ లో కనిపించాడు. మహేష్ కొడుకు గౌతమ్ చదువుల కోసం విదేశాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. చూస్తుంటే మహేష్ తన ఫ్యామిలీతో కలిసి గౌతమ్ దగ్గరకే వెళ్తున్నట్టు అనిపిస్తోంది.అయితే మహేష్ ఎన్ని రోజులు ఈ వెకేషన్ లో ఉంటాడనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఎంత వెకేషన్ లో ఉన్నా తానెప్పుడు పిలిస్తే అప్పుడు రావాల్సిందే అనే రూల్ పెట్టకుండా అయితే రాజమౌళి మహేష్ ను వదిలి ఉండరు. జక్కన్న నెక్ట్స్ షెడ్యూల్ కు రంగం సిద్ధం చేసే లోపు మహేష్ తన వెకేషన్ ను పూర్తి చేసుకుని తిరిగి వచ్చేస్తాడని తెలుస్తోంది.