రీసెంట్ గా అన్ స్టాపబుల్ షోకి వచ్చారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..బాలకృష్ణతో సందడి చేశారు.కాగా ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ అయినా ఎంతో స్టైలిష్ గా ఉంటారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. అలా అన్ స్టాపబుల్ షోకు కూడా స్టైలిష్ గా ముస్తాబై వచ్చాడు . బ్లాక్ కలర్ తో చేతుల మీద వైట్, రెడ్ కలర్స్ డిజైన్ తో ఉన్న హుడీ తో బాలయ్య షోలో సందడి చేశాడు. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో అభిమానులు ఈ హుడీ గురించి నెట్టింట తెగ వెతికారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ధరించిన అమిరి బ్రాండ్ హుడీ ధర అసలు ధర ఒక లక్ష 10 వేలకు పైగానే ఉందని తెలుస్తోంది. అయితే డిస్కౌంట్ లో ఆన్ లైన్ లో 88 వేలకు వస్తుంది. దీంతో ఈ ధర చూసి అభిమానులు నోరెళ్ల బెడుతున్నారు.